Sunday 8 April 2012

‘గబ్బర్ సింగ్’ ఆడియో అఫీషియల్ ప్రెస్‌నోట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమా ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఆడియో వేడుకపై నిర్మాత బండ్ల గణేష్ అఫీషియల్‌గా ప్రస్ నోట్ విడుదల చేశారు. ఈ నెల 15న ఆడియో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్మాత తెలియజేస్తూ...‘గబ్బర్ సింగ్ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరిగి పోతున్నాయి.
దానికి తగ్గట్టుగానే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే నెం.1 హిట్ గా నిలబడ్డమే కాకుండా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుందని ఆశాభాశం వ్యక్తం చేశారు.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్. ఏప్రిల్ 15న చాలా గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేయబోతున్నాం. మేలో సమ్మర్ స్పెషల్ గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
గబ్బర్ సింగ్ ఆడియో కనీవినీ ఎరుగని రీతిలో నగరాల్లో ఒకే రోజు మూడు నగరాల్లో విడుదల చేస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేకమైన విమానాన్ని నిర్మాత బుక్ చేశాడని, తొలుత తిరుపతి వెళ్లి ఓ పాటను విడుదల చేసి, అనంతరం మధ్యాహ్నం విశాఖ చేరుకుని అక్కడ మరో సాంగును, సాయంత్రానికి హైదరాబాద్ లో దిగి ఇక్కడ సినీ ప్రముఖుల సంక్షంలో గ్రాండ్ గా అన్ని పాటలు విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం. అయితే నిర్మాత ఈ ప్రెస్ నోట్ లో ఆ ప్రస్తావన తేక పోవడంతో కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఆడియో విడుదల చేస్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాశీభట్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్

No comments:

Post a Comment