Sunday 8 April 2012

మహేష్, సుకుమార్ చిత్రం టైటిల్ అదా?


మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి చంద్రుడు ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఆగడు అనే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం

 సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రం ఈ నెల 23 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. హైదరాబాద్‌లో ఈ నెల 23 నుంచి ఓ పాట చిత్రీకరణతో షూటింగ్ ప్రారంభించి, తదనంతరం థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ చేయనున్నారు.

 దూకుడుని నిర్మించిన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే 2013 సంక్రాంతి పండుగకి విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే తొలి సారిగా దేవి శ్రీప్రసాద్ మహేష్ బాబు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం అభిమానులు కోరుకునే అన్నికమర్షియల్ అంశాలతో తెరకెక్కనుంది.
అలాగే గోవా బ్యాక్‌ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు. మహేష్ బాబు మరో వైపు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు సరసన సమంత నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి ప్రధాన పాత్రలుగా మల్టీ స్టారర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.

No comments:

Post a Comment