Sunday 8 April 2012

దివ్య భారతిపై సినిమా.. పూర్తి వివరాలు




అర్దాంతరంగా జీవితం ముగిసిన అందాల తార దివ్య భారతి జీవిత చరిత్ర త్వరలో తెరకెక్కుతోంది. సిల్క్‌స్మిత జీవిత చరిత్రను ఆధారం చేసుకుని తీసిన ‘ది డర్టీ పిక్చర్’ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్టు కావటంతో దర్శక,నిర్మాతలు ఈ ప్లాన్ చేస్తున్నారు. దేశభక్తుడు ‘భగత్‌సింగ్’ ఫేమ్ విక్రమ్ సాంథూ ఈ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ చిత్రం కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటుందని భావిస్తున్నారు.


అయితే దర్శకుడు విక్రమ్ మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చిన్న వయసులో స్టార్ అయిన ఒక నటి జీవితాన్ని కథగా తెరకెక్కిస్తున్నాం. అంతేతప్ప మీరనుకున్నట్లు అది దివ్యభారతి రియల్ స్టోరీ కాదు అని తేల్చి చెప్పారు. అయితే ‘ది డర్టీ పిక్చర్’సమయంలోనూ నిర్మాతలు తమ చిత్రానికి సిల్క్‌స్మిత జీవితచరిత్రకు పోలిక లేదని చెప్పారు.




ఇక ఈ చిత్రంలో నటీనటులు విషయానికి వస్తే...ఒక పాపులర్ నటి లేదా పూర్తిగా కొత్త అమ్మాయి కానీ ఈ చిత్రంలో నటించే అవకాశాలున్నట్లు విక్రమ్ తెలిపారు. పాపులర్ నటితో చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. అయితే ఆమె పోలికలున్న ఆమెతో అయితేనే బెస్ట్ అన్నట్లుగా అన్వేషిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా చెప్తోంది. దివ్య భారతి పై సినిమా అనేది ఖచ్చితంగా భాక్సాఫీస్ కి డబ్బులు తెచ్చిపెట్టే వ్యవహారమే అంటున్నారు.


అలాగే ఈ చిత్రం జూలై నుంచి ఈ చిత్రం సెట్స్‌మీదికి వెళ్ళనుంది. భారతదేశం, దుబాయ్‌లలో షూటింగ్ జరుగుతుందని సమాచారం. దివ్య భారతి లాంటి పోలికలున్న అమ్మాయికోసం ముంబైలో ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. దక్షిణాది భాషలకు చెందిన హీరోలను పోలిన పాత్రలు కూడా ఈ చిత్రంలో ఉండే అవకాశం ఉందని గాసిప్స్ వినపడుతున్నాయి. దివ్య భారతి చివరి చిత్రాన్ని చివరలో రంభని పెట్టి పూర్తి చేసారు. బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు వంటి చిత్రాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి.

No comments:

Post a Comment