Sunday 8 April 2012

బికినీ ధరించటంపై కాజల్ స్పందన


బికినీ వేస్తేనే హాట్ గా కనిపించినట్టు, లిప్ టు లిప్ కిస్ లతోనే యూత్ ని ఆకట్టుకోవచ్చనే మాటల్ని నేను ఏమాత్రం నమ్మను అంటోంది కాజల్. ఆమె రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ బికినీ వేసుకుని నటించాలనే కోరిక తనకు అస్సలులేదని తేల్చి చెప్పింది.


 మహేష్ తో బిజినెస్ మ్యాన్ లో లిప్ టు లిప్ కిస్ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత బికిని వేసుకుని నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె ఇలా మాట్లాడింది. అలాగే...తెరపై సెగలు పుట్టించాలంటే అరకొర దుస్తులు ధరించి అందాలు ఆరబోయడమొక్కటే మార్గం అని చాలా మంది భావిస్తారు. కానీ నేను దానికి వ్యతిరేకిని. కేవలం హాట్ గా కనపడి కవ్వించటానికి అదొక్కటే మార్గం కాదంటాను. చక్కటి చీరకట్టుతోనూ యూత్ ని అలరించవచ్చు. బిగుతుగా ఉండే టీ షర్ట్‌లతోనూ అందంగా కనిపించవచ్చు అంది.  అలాగే స్కిన్‌షోకి నేనెప్పుడూ విరుద్ధమే.
నేను నటించిన సినిమాలు... మా కుటుంబ సభ్యులందరితోనూ కలిసి సౌకర్యవంతంగా చూసేలా ఉండాలి.
ఎవరెన్ని చెప్పినా ఆయా నటీనటులు తెరపై ప్రవర్తించే విధానంతో మాత్రమే సన్నివేశం పండుతుంది. 


 అలాగే.. తెరపై కనిపించే ప్రతి నటుడికీ, నటికీ కొన్ని వ్యక్తిగతమైన హద్దులుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని కెరీర్‌ చివరిదాకా ప్రయాణం చేస్తుంటారు. అలా నాకూ కొన్ని హద్దులున్నాయని అంది కాజల్‌. ప్రస్తుతం కాజల్ తెలుగులో మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలోనూ మరో రెండు చిత్రాలు కమిటైనట్లు సమాచారం. మహేష్ సరసన ఆమె చేసిన బిజినెస్ మ్యాన్ చిత్రం సూపర్ హిట్ కావటంతో ఆ పెయిర్ కి మంచి డిమాండ్ ఏర్పడింది.


 రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వినాయిక్ ఆమెను రామ్ చరణ్ సరసన బుక్ చేసారు. సుకుమార్ సైతం ఆమె వైపే మొగ్గు చూపి మహేష్ ప్రక్కన తీసుకున్నారు. బిజినెస్ మ్యాన్ 2 చేసినా ఆమెనే తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. శ్రీను వైట్ల తను ఎన్టీఆర్ తో చేస్తున్న బాద్షా కోసం సైతం ఆమె నే ప్రిపర్ చేసారు. హిందీలోనూ ఆమె ఓ రెండు చిత్రాలు తాజాగా ఒప్పుకుంది. అయితే డేట్స్ ఎడ్జెస్ట్ మెంట్స్ చేయటంలో సతమతమవుతోందని వినికిడి.

No comments:

Post a Comment